ఏఐసీసీ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్‌ను కలిసిన కాంగ్రెస్ దళిత నేతలు

ఏఐసీసీ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్‌ను కలిసిన కాంగ్రెస్ దళిత నేతలు
సంగారెడ్డి, ఆంధ్రప్రభ:
కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు మంగళవారం ఏఐసీసీ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, దళితుల సంక్షేమం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించినట్లు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత గంగేరి శ్రీహరి తెలిపారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ దళిత నేత డాక్టర్ గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించినట్లు నేతలు పేర్కొన్నారు.
దళితుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధనలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
