ఘనంగా సేవాలాల్ జగదంబ 15వ వార్షికోత్సవం

మెదక్, ఆంధ్రప్రభ : నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి పెద్దతాండలో సేవాలాల్ జగదంబ అమ్మవారి 15వ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తండావాసుల మత గురువైన ప్రేమ్ సింగ్ మహారాజ్ గురువులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ దుశాని చత్రియ నాయక్, తండా పెద్దలు బిక్యా నాయక్ తదితరుల ఆధ్వర్యంలో ప్రేమ్ సింగ్ మహారాజ్ గురువులతో పాటు జిల్లా వ్యాప్తంగా హాజరైన అర్చకులను శాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తండా పెద్ద బిక్యా నాయక్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం సేవాలాల్ జగదంబ అమ్మవారి వార్షికోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం తండావాసులకు గర్వకారణమని అన్నారు. ఐక్యత, భక్తిభావంతో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాష నాయక్, తండా వాసులు నాయకులు పాల్గొన్నారు.