మహిళ రైలు ఎక్కుతుంటే..
మహిళ రైలు ఎక్కుతుంటే..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫార్మ్ నెంబర్ P/F-NO 3 & 4 పై Tr.No 12746 మణుగూరు ఎక్స్ప్రెస్ ఎక్కబోతు ప్రమాదవశాత్తు జారిపడి మహిళ మృతి చెందిన ఘటన వరంగల్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. జిఆర్పి సి ఐ పి. సురేందర్ కథనం ప్రకారం బుధవారం ఉదయం ఒక మహిళ మణుగూరు రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తున జారిపడి తీవ్ర గాయాల పాలయింది. ఆన్ డ్యూటీ రైల్వే సిబ్బంది 108 అంబులెన్స్ వారికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మహిళను పరీక్షించగా మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు.
మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు, గుర్తింపు పత్రాలు గాని, విలువైన వస్తువులు, నగదు & రైల్వే ప్రయాణపు టికెట్ గాని ఏమీ లేవు. మృతురాలు 5’4″ఎత్తు, ఎరుపు రంగు, నల్లటి తల వెంట్రుకలు, బక్కపలచగా ఉండి. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ చీర, రెడ్ కలర్ జాకెట్ ధరించింది. గుర్తుపట్టుటకు వీపుపై పుట్టుమచ్చ కలదు. మృతురాలి మెడలో పసుపు రంగు దారం చేతులకు బ్రౌన్ కలర్ రెండు మట్టి గాజులు కలవు. మృతురాలి వివరాలు తెలియనందున మృత దేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీ నందు భద్రపరచడమైనది. IRP వరంగల్ ఉత్తర్వుల ప్రకారం ఎస్ రవీందర్ రెడ్డి రైల్వే హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారనీ.. వివరాలు తెలిసినవారు ఈ కింది సెల్ నంబర్ కు Cell.No 9849749220, 8712658627 సమాచారం అందించవలసిందిగా జిఆర్పిసిఐ కోరారు.
