అభివృద్ది చూసి అభ్యర్థులను ఎంచుకోండి…

అభివృద్ది చూసి అభ్యర్థులను ఎంచుకోండి…

  • నమ్మి మోసపోతే మళ్లీ గోసపడక తప్పదు
  • మున్సిపల్‌పై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురురాలే
  • మా అభ్యర్థులను ఆశీర్వదించి ఆదరించాలే
  • మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : గత ప్రభుత్వహాయాంలో మంథని అభివృధ్దిని చూసి మరింత అభివృధ్ది కోసం భీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ కోరారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో బాగంగా గురువారం ఒకటవ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి గంధం ఆంజనేయులు తో కలిసి మంథని మున్సిపల్‌ పరిధిలోని పవర్ హౌస్ కాలనీ, చైతన్యపురి కాలనీ, శ్రీరామ కాలనీ లో ఆయన అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.

పదేళ్ల క్రితం మంథని పట్టణం ఎంత వెనుకబాటులో ఉండేదో, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఎమ్మెల్యేగా పట్టణ అభివృద్దికి చేసిన కృషిని గమనించాలని అన్నారు. పట్టణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశామని, అలాగే మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా పుట్ట శైలజ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు, అబద్దాలను నమ్మి ఓట్లు వేస్తే రెండేళ్లుగా గోసపడుతున్నామని, మళ్లీ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు అవకాశం కల్పిస్తే కన్నీళ్లు తప్ప ఏమీ ఉండదన్నారు.

అభివృద్ది, ప్రజాసంక్షేమం, సమస్యల పరిష్కారం కావాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆదరించి ఆశీర్వదించాలని, పేద బడుగు బలహీనవర్గాల కోసం తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. రెండేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పట్టణ ప్రజలకు జరిగిన మేలు ఏంటో ఆలోచించి ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. development

Leave a Reply