ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్..

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ బుధవారం పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరారు. అనంతరం వార్డులో పారిశుద్ధ్య పరిస్థితిని అధికారులు, సిబ్బందితో కలిసి చూశారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అంగడి ఆంజనేయులు, కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply