TG CM | హ్యామ్ రోడ్ల పనులకు శ్రీకారం
TG CM | హ్యామ్ రోడ్ల పనులకు శ్రీకారం
కనగల్‌లో పైలాన్ ఆవిష్కరణ
రూ.83 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపన..
బహిరంగ సభలో సీఎం ప్రసంగం
TG CM | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నల్లగొండ జిల్లా కనగల్ వద్ద పైలాన్‌ను ఆవిష్కరించనున్న సీఎం, రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్ల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర 441 ప్యాకేజీల్లో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్లగొండలోని ఎన్‌జీ కళాశాల మైదానానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి, రూ.83 కోట్ల వ్యయంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న తాగునీటి పథకం (ఫేజ్-1) పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన వివరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
