ఫ్రైడే–డ్రై డేతో దోమల వ్యాధులను నివారిద్దాం
- వార్డ్ ప్రజలకు అవగాహన కల్పించిన కౌన్సిలర్ వెంకన్న
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 11వ వార్డు గాంధీనగర్‌లో శుక్రవారం ఫ్రైడే–డ్రై డే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా 11వ వార్డు కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న మాట్లాడుతూ, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం ఫ్రైడే–డ్రై డే కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఇళ్లలో, ఇంటి పరిసరాల్లో, కూలర్లు, డ్రమ్‌లు, కుండీలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు వంటి వాటిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించి తమ ఇళ్లు, కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ మెంట రమణ నగేష్, వార్డు అధికారులు సంధ్యారాణి, కిరణ్, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి రమేష్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అవిశెట్టి కిరణ్ కుమార్, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు నిమ్మల శ్రీను, నాయకులు బీసు రాహుల్, బందెల రవి, మున్సిపల్ సిబ్బంది నరేందర్, డీఎల్‌వో సతీష్ తదితరులు పాల్గొన్నారు.
