పెదపలకలూరులో రీ సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్
పెదపలకలూరులో రీ సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరు, ఆంధ్రప్రభ :
గుంటూరు మండలం పెదపలకలూరులో రీ సర్వే కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ శుక్రవారం తనిఖీ చేశారు. రీ సర్వేలో చేపట్టిన కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులతో స్వయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రైతులు చేస్తున్న పంటల సాగు, వాటి వివరాలు, పొందే ఆదాయం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. 481 ఎకరాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తి చేసినట్లు సర్వే అధికారులు, సిబ్బంది తెలియజేశారు. రీ సర్వే ప్రక్రియకు ముందుగా రైతులకు నోటీసులు జారీ ముందస్తు సమాచారం వంటి అంశాలను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు.
రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వేకు అనుసరించే వలసిన కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలని అన్నారు. రైతులకు ముందుగా తెలియజేసి, రీసర్వే పట్ల వివరాలను తెలియజేయాలని అన్నారు. రైతుల అభ్యంతరాలు ఉంటే వాటిని పరిగణలో తీసుకొని స్పష్టమైన విచారణ చేయాలని ఆదేశించారు. రీ సర్వే ద్వారా భూముల వివరాలు పక్కాగా నమోదు కావలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్వే శాఖ ఉపసంచాలకులు తోయజాక్షజ రావు, తహసీల్దార్ సుభాని, స్థానిక రైతులు పాల్గొన్నారు.

