ఢిల్లీ స్థాయిలో దక్కిన గుర్తింపు వెనుక ఏముంది..?

ఢిల్లీ స్థాయిలో దక్కిన గుర్తింపు వెనుక ఏముంది..?

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంత్రుల పనితీరు, అభివృద్ధి ర్యాంకుల్లో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమని ఏపీ బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ సభ్యుల పనితీరుపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సోమనాథ్ ప్రకటించిన ర్యాంకుల్లో కిషన్ రెడ్డి తొలి వరుసలో నిలవడం ఆయన సమర్థతకు నిదర్శనమన్నారు.

ఫైల్స్ క్లియర్ చేయడం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సేవలో చురుకుదనం వంటి అంశాల్లో కిషన్ రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు.

ప్రజలతో నిరంతర అనుసంధానం, నిజాయితీతో కూడిన సేవాభావం, అభివృద్ధి పట్ల అంకితభావం కారణంగానే ఈ గుర్తింపు లభించిందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచిన కిషన్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Leave a Reply