After-4o-Days : నవ వధువు ఆత్మహత్య? Andhra Prabha Crime News

After-4o-Days : నవ వధువు ఆత్మహత్య? Andhra Prabha Crime News

  • విశాఖలో సంచలనం
  • తాళి కట్టిన 40 రోజులకే
  • ఉరికి వెలాడిన కొత్త పెళ్లికూతురు
  • 20 రోజులకే కొత్త కాపురంలో విషాదం
  • అనుమానస్పద మృతిగా కేసు నమోదు

( ఆంధ్రప్రభ , విశాఖ పట్నం బ్యూరో)

After-4o-Days : విశాఖ పీఎంపాలెం పోలీసుస్టేషన్ పరిధి ఆర్ హెచ్ కాలనీలో విషాద ఘటన చోటు ,చేసుకుంది. విశాఖపట్నంలో సంచలనం రేపింది. పెళ్ళైన 40 రోజులకే నవ వధువు యాండ్రాపు కృష్ణవేణి (25) అనుమానాస్పదస్థితిలో ఊరి వేసుకుని మృతి. విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన దగ్గర బంధువైన యాండ్రాపు మురళీతో ఈ ఏడాది మే 13వ తేదీన కృష్ణ వేణికి వివాహమైంది. మురళీ ఓ కంపెనీ లో పనిచేస్తుండగా, కృష్ణవేణి గోపాల పట్నం ప్రాంతంలోని షాప్ లో పనిచేస్తున్నారు. కొత్తగా పెళ్ల యిన వీరు గత 20 రోజులుగా పీఎంపాలెంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మురళీ బుధవారం ఉదయం డ్యూటీ నుండి రాత్రి ఇంటికి తిరిగొచ్చేసరికి ఆమె ఫ్యాన్కు ఉరేసుకుని విగ తజీవిగా కనిపించింది. దీంతో మురళీ స్థానిక పోలీసులకు సమాచారమందించారు. వెంటనే ఏసీపీ అప్పలరాజు, సీఐ బాలకృష్ణ ఘట నాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కృష్ణవేణి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ పేర్కొన్నారు.