రైతుల రహదారి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే…
రైతుల రహదారి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే…
రోలుపాడు రైతుల వినతికి వెంటనే స్పందన
సురవరం–రోలుపాడు ప్రాంతాల్లో ప్రత్యక్ష పరిశీలన
3 కి.మీ రహదారి నిర్మాణానికి చర్యలు ప్రారంభం
వర్షాకాల ఇబ్బందుల నివారణకు కల్వర్ట్ ప్రతిపాదన
తిరువూరు, ఆధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గంలోని రోలుపాడు గ్రామ రైతులు ఎదుర్కొంటున్న రహదారి సమస్యపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తక్షణ స్పందన వ్యక్తం చేశారు. రైతులు కార్యాలయంలో సమస్యను వివరించగా, వెంటనే సురవరం–రోలుపాడు గ్రామాల్లో పర్యటించి రహదారి పరిస్థితిని పరిశీలించారు.
వర్షాకాలంలో రహదారి దెబ్బతిని రాకపోకలు నిలిచిపోవడం వల్ల రైతులు పంటలను మార్కెట్‌కు తరలించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించారు. ఈ సమస్యను ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
దాదాపు 3 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి అంచనా వ్యయం సిద్ధం చేసి, అనుమతులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట కల్వర్ట్ నిర్మాణం కూడా చేపట్టాలని సూచించారు.
రహదారి నిర్మాణం పూర్తయితే సురవరం నుంచి ముష్టికుంట్ల మీదుగా నెమలి వరకు రాకపోకలు సులభతరం అవడంతో పాటు రైతులకు ఉపశమనం కలుగుతుందని గ్రామస్థులు తెలిపారు.
