కృష్ణా జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు

కృష్ణా జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు

  • ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్లను (ఎస్ఐలు) బదిలీ చేస్తూ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) వి. విద్యాసాగర్ నాయుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం మరియు విధి నిర్వహణలో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.

బందరు & మచిలీపట్నం పరిధి: బందరు తాలూకా ఎస్ఐ కె. నాగరాజును బందరు సిసిఎసికి, జి.వి.వి. సత్యనారాయణను గుడివాడ సిసిఎస్ కు బదిలీ చేశారు. చిలకలపూడి ఎస్ఐ కె. శ్రీనివాస్ పామర్రుకు, ఉమెన్ పీఎస్ ఎస్ఐ జి. రమేష్ బాబును బందరు తాలూకాకు పంపారు.

గుడివాడ & ఉయ్యూరు పరిధి: పెనమలూరులో పని చేస్తున్న డి. సత్య సుధాకర్ గుడివాడ సీసీఎస్ కు, కె. ప్రతాప్ రెడ్డి ఉయ్యూరు పిఎస్ కు బదిలీ అయ్యారు. ఉయ్యూరు రూరల్ ఎస్ఐ డి. సుభాషిణిని పెదపారుపూడికి, పెనమలూరు ఎస్ఐ డి.ఎస్. తాతాచార్యులను ఉయ్యూరు రూరల్ కు కేటాయించారు.

గన్నవరం & కంకిపాడు పరిధి: కంకిపాడు ఎస్ఐ డి. సందీప్ పెనమలూరు క్రైమ్ విభాగానికి బదిలీ కాగా, కె.వై. దాస్ ను కంకిపాడు ఎస్-1గా నియమించారు. గన్నవరం ఎస్ఐలుగా కె. శ్రీధర్, ఎన్. ప్రశాంతిలను, గన్నవరం ట్రాఫిక్ కు బి. ప్రభాకర్ రావు, టి. వెంకట రమణలను కేటాయించారు.

ప్రత్యేక విభాగాలు (DSB/CCS): జిల్లాలోని డీఎస్బీ, సీసీఎస్ విభాగాల్లో కూడా పలువురు ఎస్ఐలకు స్థానచలనం కలిగింది. మహ్మద్ కిశ్వర్ కృష్ణా డిఎస్బికి, ఆర్‌. కవిత కృష్ణా డిసిఆర్‌బికి బదిలీ అయ్యారు.

ఇతర ముఖ్యమైన పోస్టింగులు:


అవనిగడ్డ – పి. గౌతమ్ కుమార్

చల్లపల్లి – డి. దుర్గాంజనేయులు

హనుమాన్ జంక్షన్ – వి. సురేష్

కోడూరు – కె. చాణిక్య

ఘంటసాల – వేమన చందన

వీరవల్లి – సత్యం సురేష్

ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీ అయిన అధికారులు తక్షణమే తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. మరికొందరు అధికారులు ప్రస్తుతం వారు పని చేస్తున్న స్థానాల్లోనే కొనసాగనున్నారు.

Leave a Reply