ట్రాక్టర్ బోల్తా పడి పదిమందికి గాయాలు

ట్రాక్టర్ బోల్తా పడి పదిమందికి గాయాలు
నాగాయలంక – ఆంధ్రప్రభ : నాగాయలంక సాయిబాబా గుడి వద్ద కూలీల ట్రాక్టర్ బోల్తాపడి గురువారం పదిమందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ప్రమాద బాధితులను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నంకు వైద్యులు రిఫర్ చేశారు.
ప్రమాద బాధితులందరూ నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సాయంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి ట్రాక్టర్ బోల్తా పడటంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో.. తెలియని పరిస్థితి నెలకొండం.. 10 మందికి గాయాలు కావడంతో ఒక్కసారిగా భయపడ్డారు. ప్రమాద బాధితులకు వైద్యులు వైద్య చికిత్స చేస్తున్నారు.

