ట్రయల్ రన్ విజయవంతం

ట్రయల్ రన్ విజయవంతం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా హోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 6వ తేదీన స్వామివారి బ్రహ్మరథోత్సవం జరుగునున్నది. ఈ సందర్భంగా స్వామివారి రథాన్ని దేవాదాయ శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతు పనులను చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం దేవాలయ ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు, అర్చకులు మయూరం బాలాజీ చార్యులు ఆధ్వర్యంలో రథాన్ని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆర్ అండ్ బి జేఈ నాగభూషణం, దేవాలయ ఈవో సాకే రమేష్ బాబు, ఎస్సై జనార్దన్ నాయుడు రథాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో స్వామివారి రథాన్ని ట్రాక్టర్లు సహాయంతో, మరియు భక్తులు కొద్ది దూరం వరకు రథాన్ని లాగారు. దీనితో రథం ట్రయల్ రన్ విజయవంతం కావడంతో, భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఎస్సై జనార్దన్ నాయుడు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బొల్లినేని పద్మాక్షి, దబ్బర మాధవి, బోయ రాములమ్మ, కురుబ ఇంద్రమ్మ, బోయ ఎర్రమ్మ, చావలి బాయి, మీనుగ రామకృష్ణ, ధనంజయ ఆచారి, చంద్రమౌళి స్వామి, మంగళ చిన్న నారాయణప్ప, మండల టిడిపి నాయకులు ఇంద్రావతి సుధాకర్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply