చిన్న వయసులో పెళ్లిళ్లు చేయకండి
చిన్న వయసులో పెళ్లిళ్లు చేయకండి
రాప్తాడు, ఆంధ్రప్రభ : వేసవి సెలవుల సమయంలో కౌమార దశలోని బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆర్డీటి రాప్తాడు ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున పేర్కొన్నారు. రాప్తాడు మండల పరిధిలోని గాండ్లపర్తి గ్రామం నందు మరియు రూరల్ మండలం కందుకూరు గ్రామం నందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కిషోరి వికాసం-2026 బాల బాలికల శిక్షణా తరగతులను ఆర్డీటి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సంధర్భంగా ఏటిఎల్ మాట్లాడుతూ బాలికలు ఆహారంలో ఆకుకూరలు పండ్లు గుడ్లు పాలు వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే పదార్థాలు మనం తినే ఆహారంలో ఎక్కువగా ఉండాలి అన్నారు. కుటుంబంలోనూ సమాజంలోనూ బాలికలు తమను తాము ఎలా రక్షించుకోవాలి? అలాగే దృఢమైన వ్యక్తిత్వ విలువలను ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలపై మార్గనిర్దేశం చేశారు.అంతేకాకుండా బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై బాలికలకు అవగాహన కల్పించారు.
మానసికంగానూ శారీరకంగానూ సంపూర్ణ పరిపక్వత సాధించి 18 ఏళ్ల వయస్సు నిండిన తర్వాతే వివాహం జరగాలని ఆయన గట్టిగా ఉద్ఘాటించారు.ఆర్డీటి సహకారంతో బాలికలలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. చిన్న వయస్సులోనే తమకంటూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాని సాధన కోసం ప్రతిరోజూ కృషి చేస్తే జీవితంలో ఉన్నతమైన మరియు విశిష్టమైన స్థానాన్ని తప్పక సాధించగలరని భరోసా ఇచ్చారు.కిషోర బాల బాలికల సాధికారత మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటి సి.ఓ మల్లికార్జున అంగన్వాడీ టీచర్లు కాంతమ్మ లక్ష్మీదేవి సుజాత భారతి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
