ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

మునుగోడు, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఈ రోజు అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మందుల సత్యం ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మందుల సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో బిఆర్ఎస్ పార్టీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ఉద్యమ పార్టీగా ప్రారంభమైన బిఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం,పేదల అభ్యున్నతి, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పార్టీ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు. పార్టీ స్థాపక నాయకత్వం చూపిన మార్గంలో ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డ్ మెంబర్లు,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply