లక్ష్మీనరసింహస్వామి వారికి వెండి కిరీటాన్ని బహూకరణ

లక్ష్మీనరసింహస్వామి వారికి వెండి కిరీటాన్ని బహూకరణ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా హోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మంగళవారం అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట గ్రామానికి చెందిన జనార్ధన ఆచారి వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి సుమారు విలువ 2, 91, 354 రూపాయల విలువగల 1 కేజీ 982 గ్రాముల స్వామివారికి వెండి కిరీటాన్ని బహుకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రేగటి నాగరాజు, జిల్లా దేవదాయశాఖ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్, ఆలయ ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు సభ్యులు మీనుగ రామకృష్ణ, చంద్రమౌళి స్వామి, ధనంజయ ఆచారి, ఉరవకొండ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్
తిమ్మప్ప, టిడిపి నాయకులు మోపిడి గోవిందు, ఎర్రి స్వామి తదితరులు పాల్గొన్నారు.