చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావటం గర్వకారణం

చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావటం గర్వకారణం
చల్లపల్లి – ఆంధ్రప్రభ : విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సాధించటం తెలుగు ప్రజలకు గర్వకారణం అని నారా లోకేష్ సేవాసమితి అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాసరావు అన్నారు. ముంబాయిలో జరిగిన ఎకనామిక్స్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతులమీదుగా అవార్డు పొందటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చల్లపల్లి మండలం పాగోలు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో వేడుకలు నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు మోర్ల రాంబాబు, టీడీపీ నేత ముమ్మనేని నానితో కలిసి యార్లగడ్డ శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యం రాష్ట్రానికి వరం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి.మధుసూదనరావు, తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు మోర్ల శివ, సొసైటీ డైరెక్టర్ వేముల హరికృష్ణ, క్లస్టర్ ఇంచార్జి మల్లంపల్లి శివరామకృష్ణ, టీడీపీ నేత మేకా పెద్దబ్బాయ్, ఎన్టీఆర్ స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
