బోధన్‌లో రూ.100 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్

బోధన్‌లో రూ.100 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్
- స్థల పరిశీలన చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
బోధన్, ఆంధ్రప్రభ: పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్” నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో ఈ అత్యాధునిక పాఠశాల భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
పాఠశాల నిర్మాణానికి సంబంధించి త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. మంచినీటి ఎద్దడిపై సమీక్ష: స్థల పరిశీలన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ (RWS) అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవోలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
