జుక్కల్ లో రాళ్ల వర్షం..
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో సాయంత్రం ఉరుములు,మెరుపులతో ఈదురు గాలులతో పాటు రాళ్ల వర్షం పడింది. అకస్మాత్తుగా వర్షం ప్రారంభం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.పంట పొలాలకు పోయిన రైతులు కూలీలు వర్షం బారిన పడ్డారు. ఈ అకాల వర్షంతో ఆయా,జొన్న, మొక్క జొన్న పంటలకు నష్టం వాటిల్లే అవకాశము ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
