కాళేశ్వరం పై అసత్య ప్రచారం…

కాళేశ్వరం పై అసత్య ప్రచారం…
- కేసీఆర్‌ను బద్నాం చేసే కుట్ర
- వేల్పూర్ మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి
వేల్పూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ పై అసత్య ఆరోపణలు కాంగ్రెస్ బిజెపి కుట్రతో చేస్తున్నారని వేల్పూర్ మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం వేల్పూర్ మండలం ఎమ్మెల్యే నివాసంలోమీడియా సమావేశంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జైడి నాగధర్, రేగుల్ల రాములు మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా ఖండించిందన్నారు.ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయినా ఖర్చు సుమారు రూ.94 వేల కోట్లు అయితే ,లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు అని అందులో 21 పంపు హౌజ్ లు,15 సబ్ స్టేషన్ లు, రూజర్వాయర్లు, వందల కి. మీ సొరంగాలు,వేల కి.మీ కేనాల్స్,పిల్లకాలువలు,విజయవంతంగాకేసీఆర్ నిర్మించారని గుర్తుచేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగానే ఎస్ఆర్ఎస్పి పునరుజీవం (కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ) ప్రాజెక్ట్ నిర్మించారాని అన్నారు.
ఈ ప్రాజెక్టు వల్లనే ఇటీవల జనవరి,ఫిబ్రవరి నెలల్లో కాకతీయ కాలువ,వరద కాలువల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిన సందర్భంలో బాల్కొండ,కోరుట్ల,జగిత్యాల ప్రాంతాల్లో పంటలుఎండిపోకుండాకాపాడగలిగామని తెలిపారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించగలిగామని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన రివర్స్ పంపింగ్ లేకుంటే వరద కాలువకు నీళ్లు ఎక్కడ నుండి వచ్చేవో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలిగుతారా అని ప్రశ్నించారు.
కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేస్తోందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద 84 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినప్పటికీ, వాటిని మరమ్మతు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి,సత్యం,దయాకర్,రవి, సుంకరి రాములు, దాస్ ,అశోక్, పాల్గొన్నారు.
