86 మంది లబ్ధిదారులకు రూ.36.34 లక్షల సీఎం సహాయనిధి..
పెద్దకౌకుంట్లలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: మండలంలోని పెద్దకౌకుంట్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన 86 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.36,34,710 విలువైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఇప్పటికే ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందాయని, భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పయ్యావుల కేశవ్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
