ap | చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీపీఐ నేత..

ap | చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీపీఐ నేత..
ఏ ముఖం పెట్టుకుని వెళ్లారు?
ap | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడులో తెలుగు పాఠశాలలను నిషేధించారని, ఆ సమయంలో చంద్రబాబు కనీసం స్పందించకుండా మౌనంగా ఉన్నారని నారాయణ ఆరోపించారు. తెలుగు భాషకు, తెలుగు వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు విప్పని చంద్రబాబు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తమిళనాడులోని తెలుగు వారిని ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు స్వయంగా తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఆయనను అంగీకరించబోరని నారాయణ స్పష్టం చేశారు.
