మట్టపల్లి క్షేత్రంలో గోసేవ

మట్టపల్లి క్షేత్రంలో గోసేవ
- గోమాతలకు గ్రాసం అందజేసిన మేకపోతుల విజయ్ కుటుంబం
గరిడేపల్లి, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలోని గోశాలలో గోమాతలకు గ్రాసం పంపిణీ చేసి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. గరిడేపల్లికి చెందిన మేకపోతుల విజయ్ – సుధారాణి దంపతులు తమ సొంత ఖర్చులతో ఒక ట్రాక్టర్ గడ్డిని గోమాతల కోసం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ పురోహితుడు కొంపెల్లి కృష్ణయ్య ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించి, గడ్డిని గోశాలకు సమర్పించారు. గోసేవ అత్యంత పుణ్యప్రదమైన కార్యమని, స్వామివారి సన్నిధిలో ఇలాంటి సేవలు చేయడం అదృష్టమని భక్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుట్ట బక్కయ్య, మేకపోతుల పురుషోత్తం, మన్నెం మట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లి గోశాలలో గోమాతలకు గడ్డి లేదా ఇతర గ్రాసాన్ని అందజేయాలనుకునే భక్తులు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు:
