AP | సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్‌..

  • ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్‌లు విరాళం

సినీనటుడు సోనూసూద్ సోమవారం సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా.. నాలుగు అంబులెన్స్‌లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా సోనూసూద్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. తన ఆశయ సాధనలో భాగస్వామి అయినందుకు ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *