చిన్న ఓగిరాలలో కుల గోల..

చిన్న ఓగిరాలలో కుల గోల..
ఉయ్యూరు, ఆంధ్రప్రభ : ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాలలో సభ్య సమాజానికే తలవొంపుల ఘటన చోటు చేసుకుంది. మనం నాగరికంగా ముందుకు వెళ్తున్నావా…వెనక్కి వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి. బీసీ ఏరియాలో దళితుడు స్థలం కొనటమే అతను చేసిన నేరమైంది. దళితుడువై ఉండి మా ఏరియాలో స్థలం కొనుగోలు చేస్తావా…నిన్ను నరుకుతాం.. చంపుతాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు తెలిపాడు. స్థలము వైపు దడికట్టి స్థలంలోకి వెళ్లకుండా అడ్డగించారని, బాత్రూం పైపులైను సిమెంట్ రోడ్డుపై వేస్తూ రోడ్డుపై నడవకుండా ఆటంకపరుస్తున్నారని తెలిపాడు.

గత కొద్దికాలం క్రితం రాజులపాటి లలిత కుమారి స్థలంను సూదులగంటి కోటి ప్రసాద్ స్థలం కొనుగోలు చేశాడు ఆ స్థలంలోకి మీరు రావద్దని పక్కింటి వారైనా పడమటి భాను, పడమట రామకృష్ణ, పడమటి చిన్న అంకమ్మ, పడమటి వెంకటేశ్వరరావులు కులం పేరుతో దూషిస్తూ.. స్థలంలోకి వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. ఈ విషయంపై కోటి ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నత అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని కోటి ప్రసాద్ కోరుకుంటున్నాడు.
