నిధులపై చర్చ..

నిధులపై చర్చ..

టిటిడి ఈవో ముద్దా రవిచంద్ర ను కలిసిన శ్రీశైలం ఆలయ చైర్మన్…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం మాలై ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నూతన ఈఓ ముద్దా రవిచంద్ర తిరుమలలో క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో శ్రీశైలం దేవస్థానమునకు సంబంధించి మనకు కొన్ని కోట్ల రూపాయలతో దోర్నాలలోనూ శ్రీశైలంలోను టీడీపీ ఆధ్వర్యంలో నిర్మాంచి నిర్మించాల్సిన డార్మెటరీ మరియు చౌల్ట్రీ గురించి చర్చించారు.

శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు కలిసి స్వామివారి వస్త్రము ప్రసాదాల అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే గతంలో దోర్నాల వద్ద టీటీడీ ఆధ్వర్యంలోకొన్ని కోట్లరూపాయలతో నిర్మించాల్సిన డార్మెటరీ మరియు చౌల్ట్రీ గురించి వారితో చర్చించడం జరిగిందన్నారు.నెక్స్ట్ బోర్డు మీటింగ్లో దానిమీద చర్చిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందని చైర్మన్ తెలిపారు. శ్రీశైలం దేవస్థానం ఆలయం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఓ వెంకయ్య చౌదరి ని క్యాంప్ ఆఫీసులో కలిసి స్వామి అమ్మవార్ల వస్త్రము ప్రసాదము అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply