దాతల సహకారం అభినందనీయం..

దాతల సహకారం అభినందనీయం..
శావల్యాపురం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని హెచ్ఎం షేక్ మహబూబ్ సుభాని అన్నారు. ఎస్ఆర్కే ఫౌండేషన్ అధినేత, మాజీ ఉప సర్పంచ్, తెదేపా నాయకులు మారాసు రామన్న చౌదరి ఆధ్వర్యంలో మండలంలోని వేల్పూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు అవసరమగు పరీక్షా సామాగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామన్న చౌదరి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొల్లా పేరయ్య, సాదినేని కృష్ణమూర్తి, దొడ్డా ఏడుకొండలు, లింగా శ్రీనివాసరావు, దన్నవరపు శ్రీనువాసరావు, ఓబూరి మల్లిఖార్జునరావు, బొల్లా రామకృష్ణ, ఏగినాటి తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.
