AP | క‌ర్నూలు రైతు బ‌జార్ చేరుకున్న చంద్ర‌బాబు

కర్నూలు : సీఎం చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నారు. కాసేపటి క్రితమే కర్నూలు ఎయిర్ పోర్ట్ నుండి కర్నూలు నగరంలోని సీ క్యాంప్ రైతు బజార్ కు సీఎం చేరుకున్నారు. రైతు బజార్ లో ఏర్పాటు చేసిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతు బజార్ లో రైతులు, పారిశుధ్య కార్మికులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. అలాగే కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు.

Leave a Reply