అమ్మవారికి ఆషాడ బోనాలు

భవానిపురం, ఆంధ్రప్రభ: అమ్మవారి ఆషాడ బోనాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని విజయవాడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బాడిత శంకర్ అన్నారు. సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అమ్మవారి ఆషాడ బోనాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ బోనాల హైదరాబాద్ సంస్కృతి అయినప్పటికీ విజయవాడ ప్రజలు పండుగ వాతావరణంతో వాడవాడలా ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా ఆషాడ మాసం అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం 108 మంది ముత్తైదువులకు పసుపుకుంకుమ,చీరలు , తాంబూలం పంచడం విశేషమని అన్నారు. ఈ మహా గొప్ప కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన మరో ముఖ్యఅతిథి మాజీ కార్పొరేటర్ శ్రీదేవికి, మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.