కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

  • టీడీపీ సీనియర్ నేత జంపాల

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని టీడీపీ సీనియర్ నేత జంపాల సీతారామయ్య అన్నారు. కేతనకొండ గ్రామ పార్టీ అధ్యక్షుడు గోపాలరావు ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి, సంక్షేమంలో కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుందని చెప్పారు. యువనేత నారా లోకేష్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తమ వంతు కీలక బాధ్యత పోషిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో? లేదో? అడిగి తెలుసుకుని సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లేపాక్షి రావు, టీడీపీ నాయకుడు చలపతిరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.