ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళులు
కాపు సమాజానికి తీరని లోటు: శిల్పా మోహన్ రెడ్డి
నంద్యాల ప్రతినిధి (ఆంధ్రప్రభ): మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి కాపు సమాజానికి తీరని లోటని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఆయన, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ముద్రగడ కోలుకుని తిరిగి వస్తారని ఆశించామని, ఆయన మరణం తీవ్ర విషాదకరమని అన్నారు.
ముద్రగడ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన పోరాట స్ఫూర్తి, ఆశయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడిగా ముద్రగడ సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
