హిందూ సమ్మేళనంను విజయవంతం చేయాలి

హిందూ సమ్మేళనంను విజయవంతం చేయాలి
- చౌటుప్పల్ పట్టణంలో బైక్ ర్యాలీ
- సమ్మేళనం సమితి అధ్యక్షులు కృష్ణారావు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న హిందూ మహా సమ్మేళనం ను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో చౌటుప్పల్ పట్టణంలోని వీధులలో పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు కేవీబి కృష్ణారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా త్రైలింగ ప్రాంత సామాజిక సంఘటన సేవా వ్రతీ పూజ్యశ్రీ వాసుదేవానంద సరస్వతి, ముఖ్య వక్తగా తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ్ జిన్నా సత్యనారాయణరెడ్డి, మహిళా వక్తగా ప్రముఖ సామాజికవేత్త పర్వతం సంధ్యారాణి మార్గదర్శనం చేయనున్నారు. కావున ప్రతి ఒక్కరు పట్టణములోని ప్రతి ఇంటి నుండి సమ్మేళన మనకు వచ్చేటట్లుగా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి కొసనం రాంరెడ్డి, కోశాధికారి కర్నాటి శ్రీనివాసులు, డాక్టర్ వేముల నరసింహ, క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి శ్యాం ప్రసాద్, సీతారామచంద్రస్వామి దేవస్థానం అధ్యక్షులు బొబ్బిళ్ల మురళి, శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం అధ్యక్షులు బడుగు జయప్రకాష్, మహిపాల్ రెడ్డి, జక్కర్తి శేఖర్, బత్తిని రఘు, విశ్వనాథ్ శ్రీనివాస్, బిజిలి నరేష్, మునుకుంట్ల సత్యనారాయణ, గుర్రం వెంకటేశం, కాంసెట్టి చంద్రశేఖర్, భీమిడి మోహన్ రెడ్డి, బడుగు శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
