Mothkur | తొలి విడత చైర్మన్ గా జనరల్ మహిళ..!

Mothkur | తొలి విడత చైర్మన్ గా జనరల్ మహిళ..!

  • మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్ల పై ఉత్కంఠ..?
  • ఈ దఫా ఎవరు..?
  • ఆశావహుల అంచనాలు..నాయకుల్లో ఉత్కంఠ ?

Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్ల పై రాజకీయ నాయకులు, ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో మున్సిపల్ లో ఎక్కడ చూసినా, విన్నా, సోషల్ మీడియాలో సైతం రిజర్వేషన్ల పై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉన్నాయి. ఎస్సి,ఎస్టీ,బి సి,జనరల్ వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఏ సామాజిక వర్గానికి ఎన్ని వార్డులు అని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించగా దాదాపు ఖరారు అయ్యాయి.కానీ చైర్మన్ స్థానంతో పాటు ఏ వార్డ్ ఏ రిజర్వేషన్ అని మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.కలెక్టర్ పరిధిలో వార్డు కౌన్సిలర్,రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.దీంతో రిజర్వేషన్లపై రాజకీయ నాయకులతో పాటు ఆశావాహుల్లో అంతటా ఉత్కంఠ నెలకొంది.

2018 లో మున్సిపాలిటీ ఏర్పడినప్పటికీ..2020 లో మోత్కూర్ మున్సిపాలిటీ కి తొలి సారిగా ఎన్నికలు జరిగాయి.తొలి విడత లో చైర్మన్ పదవి జనరల్ మహిళ కు కేటాయించడంతో అప్పుడు అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ అభ్యర్థి తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి చైర్మన్ గా ఎన్నికైంది. 2023 డిసెంబర్ లో సాధారణ ఎన్నికలు జరగడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బి ఆర్ ఎస్ అభ్యర్థి పై అవిశ్వాసం పెట్టడంతో చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ కి చెందిన గుర్రం కవిత లక్ష్మినర్సింహ రెడ్డి ఎన్నికయ్యారు.దీంతో ఒకే టర్మ్ లో బి ఆర్ ఎస్,కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు చైర్మన్ పదవులు అలంకరించారు.రొటేషన్ పద్ధతిలో చైర్మన్, కౌన్సిలర్ రిజర్వేషన్లు మారనుండడంతో … గతంలో జనరల్ మహిళ కు చైర్మన్ పదవి కేటాయించడంతో… ఈ దఫా బి సి లేదా ఎస్సి సామాజిక వర్గాలకు చైర్మన్ పదవి కి రిజర్వేషన్ రానున్నట్లు ఊహాగానాలు అంతటా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే మోత్కూర్ మున్సిపాలిటీలో తుది ఓటర్ ,పోలింగ్ కేంద్రాల జాబితా ను అధికారులు విడుదల చేయగా…ఇక రిజర్వేషన్లు మాత్రమే ఖరారు కావాల్సి ఉంది.మరో 2 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు కావడంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం ఓ పక్క సైరన్ మ్రోగించగా…మరో ప్రక్క ఎన్నికల కమిషన్ నగారా ఎప్పుడు మ్రోగిస్తుందో అని రాజకీయ నాయకులు, ఆశావహులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే మందుల సామెల్,బి ఆర్ ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే గాధరి కిశోర్ కుమార్ లు మున్సిపల్ స్థాయిలో ఆయా పార్టీల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఆశావహులకు దిశానిర్దేశం చేశారు.

మోత్కూర్ మున్సిపాలిటీ లో ప్రధానంగా కాంగ్రెస్, బి ఆర్ ఎస్ అభ్యర్థుల మధ్య మాత్రమే పోటీ కొనసాగనుండగా…కౌన్సిలర్ టిక్కెట్ రాకుంటే ఆయా పార్టీల అభ్యర్థులు పార్టీ మారే ఆలోచనతో పాటు..వీలైతే స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు కాస్త పార్టీ గుర్తులతో నిర్వహించనుండడంతో దాదాపు గా కాంగ్రెస్, బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

Leave a Reply