ఆంధ్రప్రభ ఎఫెక్ట్..

నేలకొరిగిన వృక్షాన్ని తొలగింపు

జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్ధరించిన ఉపసర్పంచ్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని గ్రీన్ సిటీ వెంచర్ సమీపంలో జాతీయ రహదారి-63పై గురువారం భారీ వృక్షం నేలకొరిగింది. రహదారికి అడ్డంగా చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ ఘటనపై ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి స్పందించిన కమ్మర్‌పల్లి గ్రామ ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ వెంటనే చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో రహదారికి అడ్డంగా ఉన్న భారీ వృక్షాన్ని తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

చెట్టు కారణంగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను వెంటనే క్లియర్ చేసి వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.

సత్వర స్పందనతో రహదారిని అందుబాటులోకి తీసుకురావడంతో ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్‌కు వాహనదారులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.