గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి

గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి
కేరళ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే తోట
జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ: గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసిసి అబ్జర్వర్ గా పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు అన్నారు.అడూర్ నియోజకవర్గ ముఖ్య నేతలతో బుధువారం జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు.కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు తీసుకోవాల్సిన చర్యలు,ప్రచారాలు, వ్యూహాలపై నాయకులతో చర్చించారు.ఎల్డిఎఫ్ పాలనలో మైనార్టీలను, పేద,బడుగుబలహీన వర్గాలకు పట్టించుకోలేదని, దేవాలయాలకు సంబంధించిన డబ్బులు కూడా అర్జించారని ఆయన తెలిపారు,గత ఎల్డిఎఫ్ ప్రజాప్రతినిధులు ఆడూర్ నియోజకవర్గన్నీ పట్టించుకోకపోవడంతో అభివృద్ధి చెందలేదని,ఎల్డిఎఫ్ తో బెజరైన నియోజకవర్గ ప్రజలు యుడిఎఫ్ వైపు మొగ్గుచూపుతున్నారని, నియోజకవర్గ అభ్యర్థి శాంత కుమార్ ను అత్యధిక ఓట్లతో విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
