ప్రత్యేకంగా కలసి శుభాకాంక్షలు…
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, ఆయన సతీమణితో కలిసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
