Helicopter Crash | హెలికాప్టర్ ప్రమాదంలో వరుడు మృతి

Helicopter Crash | హెలికాప్టర్ ప్రమాదంలో వరుడు మృతి

Helicopter Crash | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : అమెరికాలో భారత సంతతికి చెందిన నవదంపతులకు తీవ్ర విషాదం ఎదురైంది. వివాహం జరిగిన కొన్ని గంటలకే వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో పెళ్లికొడుకు ప్రాణాలు కోల్పోగా, పెళ్లికూతురు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

జార్జియా రాష్ట్రంలోని డాసన్ కౌంటీలో వివాహ వేడుక ముగిసిన అనంతరం డేవ్ ఫిజీ, జెస్నీల దంపతులు హెలికాప్టర్‌లో విహారయాత్రకు బయలుదేరారు. అయితే డాసన్‌విల్లే సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వరుడు డేవ్ ఫిజీతో పాటు హెలికాప్టర్ పైలట్ అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లికూతురు జెస్నీలను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే హెలికాప్టర్ ప్రమాదానికి గురై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా, మృతుడు డేవ్ ఫిజీ ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. వివాహమైన కొద్ది గంటల్లోనే జరిగిన ఈ దుర్ఘటన కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

Leave a Reply