మృగశిర ఎఫెక్ట్.. చాపలకు భారీ గిరాకీ
మృగశిర ఎఫెక్ట్.. చాపలకు భారీ గిరాకీ
ధరలు పెరగడంతో కొనుగోలుదారుల అసహనం
టేకుమట్ల, ఆంధ్రప్రభ:
మృగశిర కార్తె ప్రారంభం కావడంతో చేపలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. “కార్తె ప్రారంభం రోజు చేపలు తినాలి” అనే నానుడి నేపథ్యంలో వినియోగదారులు చేపల చెరువులు, మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఉదయం నుంచే చేపల దుకాణాల వద్ద కొనుగోలుదారులు బారులు తీరారు. ఇదే అవకాశంగా తీసుకున్న అమ్మకందారులు ధరలు పెంచి విక్రయాలు జరిపారు. కిలో చేపల ధర రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.300 వరకు పెరిగినట్లు వినియోగదారులు తెలిపారు. డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని అధిక ధరలకు అమ్మకాలు జరపడంతో కొనుగోలుదారులు అసహనం వ్యక్తం చేశారు. అయితే అమ్మకాలు మాత్రం భారీగా సాగాయి.
