కో ఆప్షన్ కొలిక్కి వచ్చేనా..?

కో ఆప్షన్ కొలిక్కి వచ్చేనా..?
- రేసులో వీరే…!
- నేడు దరఖాస్తు లకి తుది గడువు
- 4 స్థానాలకు అభ్యర్థుల ఖరారు నేడే
- ఆశావాహుల్లో ఉత్కంఠ..?
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటిలో 4 కో ఆప్షన్ స్థానాలకు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు తుది గడువు కావడం.. ఎమ్మెల్యే సామెల్, ముఖ్య నేతలు, మున్సిపల్ పాలకవర్గం సమిష్టిగా కో ఆప్షన్ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. నిన్న సాయంత్రం ఎమ్మెల్యే సామెల్ స్థానిక రహదారి బంగ్లాలో 21 మంది ఆశావాహుల జాబితాను సేకరించిన అనంతరం స్వగ్రామానికి వెళ్లిపోయారు.
ఈ రోజు స్థానిక కస్తూర్భా కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినిలను ఎమ్మెల్యే సామెల్ చేతుల మీదుగా సన్మానం చేయనున్నారు. అనంతరం ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో సమావేశమై 4 కో ఆప్షన్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి, దరఖాస్తు చేసుకునేందుకు మార్గం సుగమం చేయనున్నారు. ఇప్పటికే సిద్ధమైన అభ్యర్థులు ఎట్టకేలకు మధ్యాహ్నాం ఎమ్మెల్యే ప్రకటించిన జాబితా ప్రకారం కో ఆప్షన్ స్థానాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
కో ఆప్షన్ రేసులో వీరే..
మహ్మద్ అలీ,సమీర్,నబీ,ఖాజా, జావేద్,చాంద్,కారుపోతుల శిరీష,లెంకల సుజాత,ఎర్రబెల్లి మల్లమ్మ,పొలినేని ఆనందమ్మ,అంబటి కవిత,జినుకల కనకయ్య,బుంగపట్ల యాకయ్య, మన్నే మల్లయ్య,అంబటి విజయ్ కుమార్,బొల్లెపల్లి వెంకటయ్య,పురుగుల వెంకన్న,ఎడ్ల శ్రీనివాస్,అవిశెట్టి స్వామి,మన్నే అంజయ్య,చేతరాశి అంజయ్య,అన్నెపు వెంకట్ (సీపీఐ) లు రేసులో ఉన్నారు.
