రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన సదస్సు
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై సూచనలు
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ: మండలంలోని మునిపెల్లి, మల్లాపూర్, ధర్మారం గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి బి. నాగరాజు మాట్లాడుతూ, ఈ ఏడాది సూపర్ ఎల్‌నీనో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యూరియా బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఆయిల్ పామ్ పంట సాగు అంశాలపై రైతులతో చర్చించారు. ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు, దిగుబడి అవకాశాలపై రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి జి. సుష్మిత, పంచాయతీ కార్యదర్శులు మేఘన, స్వాతి, ఆయిల్ పామ్ క్లస్టర్ అధికారి జి. విష్ణు, మునిపెల్లి సర్పంచ్ మేడిపల్లి సునీత గంగాధర్, ఉపసర్పంచ్ రంజిత్ రెడ్డి, మల్లాపూర్ సర్పంచ్ స్వప్న భీమేష్, ధర్మారం సర్పంచ్ భుర్క ముత్యం, మాజీ సర్పంచ్ రాజేందర్, ఉపసర్పంచ్ ఉదయశ్రీ, రైతులు పాల్గొన్నారు.
