ప్రియురాలిపై అనుమానం.. యువతి దారుణహత్య..!

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో వ్యక్తితో మాట్లాడుతోందనే అనుమానంతో ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అనురాగ్ అనే యువకుడు తన ప్రియురాలు కనికాపై కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడుతోందని భావించిన అనురాగ్.. ఆగ్రహంతో కనికాను హత్య చేశాడు.

హత్య అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు తన స్నేహితుల సహాయం కోరాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కనికా రక్తపు మడుగులో మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అనురాగ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.