మహిళలు వ్యవసాయం, రాజకీయాల్లో రాణించాలి….

మహిళలు వ్యవసాయం, రాజకీయాల్లో రాణించాలి….

రాప్తాడు, ఆంధ్రప్రభ : ప్రతి మహిళా సాధికారిక సాధికారిత వైపు అడుగులు వేయాలని ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో పురోగతినీ స్వయం సమృద్ధిని సాధించి ప్రగతి బాటలో ముందడుగు వేయాలని రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆదివారం రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎం.రామ్మోహన్ హాజరయ్యారు. ముందుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు ఆకుకూరల స్టాల్స్ ను పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు సీమంతాలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మహిళలు ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.

ఎమ్మెల్యే పరిటాల సునీత నియోజకవర్గ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహిస్తూ డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసామని తెలిపారు. ఒక మహిళ తన కుటుంబాన్ని సమర్థవంతంగా నడుపుతూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారన్నారు.

మహిళలు తయారు చేస్తున్న వంటలు వస్తువులు అమెరికాకు కూడా వెళుతున్నాయంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన చొరవ అన్నారు.ఒకప్పుడు తాను వంటింటికే పరిమితమైన మహిళనని కానీ పరిటాల రవీంద్ర చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. ఆరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహం వల్లనే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ స్థాయిలో నిలబడ్డానని తెలిపారు. మహిళలు రాజకీయంలోను వ్యవసాయంలోనూ రాణించాలని అన్నారు.

అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళల్ని ఎమ్మెల్యే సునీత చేతుల మీదుగా సన్మానం చేశారు. అనంతరం 6 మండలాలకు చెందిన 4107 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ శ్రీనిధి సిఐఎఫ్ ఉన్నతి రుణాల ద్వారా రూ.284.53 కోట్ల మెగా చెక్కును మహిళలకు అందజేశారు.వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళల్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానం చేశారు. అనంతరం నియోజకవర్గ మహిళలు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఘనంగా సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి తాసిల్దార్ విజయ కుమారి వెలుగు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ సుభద్రమ్మ సిడిపివోలు ఉమా శంకరమ్మ కవిత ఏపీఓ సావిత్రి వెలుగు ఏపీఎంలు సునీత హేమలత పద్మావతి ఐసిడిఎస్ సూపర్వైజర్లు లీలావతి శ్రీవాణి నాగరత్న అంగన్వాడీ టీచర్లు డ్వాక్రా మహిళలు వెలుగు సీసీలు నియోజకవర్గ మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply