ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ హల్ చల్…!
ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ హల్ చల్…!
- ఆదిలాబాద్ లో ‘కార్డెన్ సెర్చ్ ” ఆపరేషన్..!
- 67 మోటార్ బైకులు, 16 ఆటోలు, 2 ట్రాక్టర్లు, దేశి దారు మద్యం స్వాధీనం..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని వడ్డెర కాలనీలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఆకస్మికంగా పోలీసు బృందాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హడలెత్తించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా ఎస్పీ అఖిల్ మహజన్, డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకే అనుమానాస్పద ఇండ్లలో పోలీసులు ప్రవేశించి తనిఖీలు ముమ్మరం చేశారు. లైసెన్సులు ఇతర చట్టపరమైన డాక్యుమెంట్లు లేని వాహనాలను భారీ మొత్తంలో సీజ్ చేశారు. సుమారు 100 మంది పోలీసులు వడ్డెర కాలనీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా భారీ ఎత్తున వాహనాలతో పాటు అక్రమ దేశి దారు మద్యం సీసాలు స్వాధీనపరచుకున్నట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ప్రజల రక్షణ, భద్రత కోసమే కార్డేన్స్ సెర్చ్ .. ఎస్పీ అఖిల్…!
ప్రజల రక్షణ, భద్రత దృష్టిలో పెట్టుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్) ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వడ్డెర కాలనీ లో ఉదయం ఐదు గంటల నుండి 8 గంటల వరకు 100 మంది సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా సరైన ధ్రువ పత్రాలు లేని 67 ద్విచక్ర వాహనాలు, 16 ఆటో లను, రెండు ట్రాక్టర్ల ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. తనిఖీలలో 98 నిషేధిత దేశీ దారు, 12 లిక్కర్ బాటిల్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ముగ్గురుపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఎస్పీ కాలనీ ప్రజలతో మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు.
ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేశారు. దొంగతనాలు, దోపిడీలు చేయకుండా సత్ప్రవర్తనతో మెదలాలనీ తెలిపారు. ఇదివరకే కేసులలో నమోదైన వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని అన్నారు. నేర ప్రవృత్తి మారని పక్షంలో చివరగా పీడీ యాక్ట్ కేసులు సైతం నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, ప్రణయ్ కుమార్, కె ఫణిదర్, కె స్వామి, బిడి ప్రేమ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు డి వెంకటి, తోట మురళి, ఎన్ చంద్రశేఖర్, ఎస్ఐలు రాధిక, విష్ణువర్ధన్, ఎస్సైలు దేవేందర్, విష్ణు ప్రకాష్, పాల్గొన్నారు.
