ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు చేయాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయి నుంచి పారదర్శకంగా అమలు చేయాలని ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్ సూచించారు. సోమవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిఎడవెల్లి గ్రామపంచాయతీ, నర్సరీ పరిశీలించారు. గ్రామ పంచాయతీలోని వివిధ రికార్డులు పరిశీలించిమాట్లాడారు. ఉపాధి హామీ పనులు వేగవంతంగా చేపడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు.
వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. గ్రామపంచాయతీలోని వివిధ రికార్డులుపకడ్బందీగానమోదు చేయాలన్నారు. వర్షాకాలం మొక్కలు నాటేందుకు నర్సరీలో 5500 మొక్కలు జాగ్రత్తగా కాపాడుతూ మొక్కల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యతతో చేపడుతూ ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు వివిధ సౌకర్యాలు కల్పించి సకాలంలో కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
