గ్రామ అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలి..
నిర్మల్ డి ఆర్ డి ఓ విజయలక్ష్మి
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నచ్చన్ ఏల్లాపూర్ గ్రామంలో నిర్మల్ డీఆర్డీఓ విజయలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించి, ఇంకుడు గుంటల నిర్మాణం, ఫారం పండ్ నిర్మాణాలు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని అధికారులకు ఆమే సూచించారు.
అనంతరం ఉపాధి హామీ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకుని, గ్రామంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను, వివిధ వార్డులను ఆమె పరిశీలించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కడం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు గంగన్న, స్థానిక గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న, పంచాయితీ
కార్యదర్శి శాంత, ఈజీఎస్ టీఏ లు కాంతారావు, గణేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కమలాకర్, కారోబార్ మహేందర్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
