దళితరత్న అవార్డు గ్రహీత మావాలే దత్తకు సన్మానం

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మాంగ్ సమాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు మావాలే దత్తకు గురువారం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు.

అసోసియేషన్ అధ్యక్షుడు కాంబ్లే బాబాసాహెబ్ ఆధ్వర్యంలో మావాలే దత్తకు శాలువా కప్పి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో ఆయన చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డుతో సత్కరించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగిస్తూ మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.

అవార్డు గ్రహీత మావాలే దత్త మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఈ గౌరవం అందించడం గర్వకారణమని, ఇదే స్ఫూర్తితో సమాజానికి మరింత సేవ చేస్తానని తెలిపారు. ప్రభుత్వం, సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబాసాహెబ్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కాంబ్లే అన్నారావు, సంఘ నాయకులు జనార్ధన్ సొన్ కాంబ్లే, జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లారే విజయ్ కుమార్, సిద్ధార్థ్, గాయక్‌వాడ్ అంకుష్, మావాలే భరత్, దుదానే కరణ్, రామ వాగ్మరే, హనుమంత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply