ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ముత్యాల సునీల్ కుమార్
వేల్పూర్, (ఆంధ్రప్రభ): వేల్పూర్ మండల కేంద్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటర్ల నమోదు ప్రక్రియను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 100 శాతం ఎన్యూమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని, ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
