Super Cyclone@48 :  దివిసీమ ఉప్పెన

Super Cyclone@48 :  దివిసీమ ఉప్పెన

  • శవాల దిబ్బగా దివిపీమ
  • 10 వేలు పైగా మృతులు
  • కదలిన సభ్య సమాజం
  • పునర్నిర్మాణానికి ఇతోదిక సాయంఇది  48 ఏళ్ల విషాద చరిత్ర

(ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి)

దివిసీమ మహా జలయ ప్రళయానికి  మరి కొన్ని గంటల్లో  (బుధవారం) 48 ఏళ్లు నిండుతాయి. 1977  నవంబరు 19న ఈ ఉప్పెన గుర్తుకు వస్తే చాలు..  దివిసీమ   నేటికీ భీతిల్లిపోతుంది. (Suoer Cyclone)  నవంబరు 19 సాయంత్రానికి ఈదురు గాలుల ఉధృతి తగ్గింది . జడివాన ఆగింది.  అకస్మాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకటి కమ్మింది,  దివిసీమ యావత్తు నిద్రలోకి జారుకుంది. ఆ నిశి రాత్రే  దివిసీమ (Divi Seema)   పాలిట కాళ రాత్రిగా మారింది. మృత్యువు కబళించింది. దొరికినోళ్లను దొరికినట్టు మింగేసింది. కరాళ నృత్యం చేసింది.’

Super Cyclone@48 :

 ఇక తెల్లవారింది. ఆకాశంలో  భానుడు  వెలుగులు చిమ్మాడు.  అప్పుడే.. ఏ ఊరిలోమ  చూసినా  శవాల గుట్టలు పేరుకుపోయాయి. తుమ్మ పొదల్లో.. తాటి చెట్లపై కళేబరాలు అతుక్కుపోయాయి. ఆవుటు, మేకలు, గేదెలు.(Cattle). ఇలా పశువులన్నీ నిర్జీవ స్థితిలో బేలగా కనిపించాయి. ఇక రోజులు గడిచే కొద్దీ ప్రాణాలతో మిగిలిన జనాన్ని దుర్గంధం ఊపిరి సలప నీయలేదు. దప్పిక తీర్చేందుకు గుక్కెడు  లేదు. ఆకలితో జనం అలమటించి పోయారు. ఈ ఘోర ఖలికి ప్రత్యక్ష సాక్షుల గుండె వ్యథ కథ వర్ణనాతీతం.  

Super Cyclone@48 :  వామ్మో..  ఉప్పెన   

Super Cyclone @ 48

నదీ ప్రవాహంతోపాటు మట్టి కొట్టుకుని రావటం, అక్కడక్కడ మేటలు వేసి ద్వీపాలుగా మారటం భౌగోళిక లక్షణం. ఆ లక్షణాలకు ఖచ్చిమైన నిదర్శనమే ఆ ద్వీపం. ఆదే ద్వీపమైతే అందులో మరో రెండు దీవులుండటమే ఇక్కడి విశేషం. నవ్యాంధ్రప్రదేశ్ మూలగా బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉన్నవే ఈ ద్వీపాలు. 400 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్న ఆ ద్వీపానికి ( Divi Island)  ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చింది. 1977 ఉప్పెన సమయంలో ఆ ద్వీపమే దివిసీమ.

Super Cyclone@48 :  సూపర్​ సైక్లోన్​ గమనం ఇలా..

Super Cyclone@48 :

అది 1977  నవంబర్ 14 ఉదయం సైక్లోన్​ ను శాటిలైట్ (Satillite)​ గుర్తించింది.  నికోబార్ (Nikobar)  దీవులకు నైరుతి దిశలో దాదాపు 520 కిలోమీటర్లు (320 మైళ్ళు) దూరంలో ఉంది. మధ్య –ట్రోపోస్పిరిక్ (Tropospiric)  ఉప ఉష్ణమండల శిఖరం దక్షిణ అంచున 25 కిమీ/గం (16 మైళ్ళు) వేగంతో పశ్చిమానికి ప్రయాణిస్తూ,  స్థిరంగా వ్యవస్థీకృతమైంది,   ఆ రోజు ఉదయం తరువాత తీవ్ర వాయుగుండంగా మారింది .

 ఆ రోజు మధ్యాహ్నం 13:10 గంటలకు .జాయింట్  టైఫూన్ హెచ్చరిక కేంద్రం (Joint Typhoon Warning Centre)  (JTWC)       హెచ్చరికను జారీ చేసింది. నవంబర్ 15న  08:00 UTCకి, తుఫాను బలపడింది.  గాలి వేగం 75 కి.మీ/గం (47 మైళ్ళు) ఉంటుందని ఉపగ్రహ డేటా (Satillite Data) సూచించడంతో JTWC తొలి హెచ్చరికను జారీ చేసింది. 

 నవంబర్ 15న  మధ్య-ట్రోపోస్పిరిక్ యాంటీ సైక్లోన్ (Anti Cyclone)  బలహీనపడింది,   వాయువ్య దిశలో 7 కి.మీ/గం (4.3 మైళ్ళు)తో  కదలిక  నెమ్మదించింది.  నవంబర్ 16 ప్రారంభంలో,   సఫిర్- సింప్సన్ హరికేన్ స్కేల్‌పై  తీవ్రంగా కనిపించింది. 

 నవంబర్ 17న 10:30 గంటలకు   భారత తీరంలో 195 కి.మీ/గం (121 mph) వేగంతో గాలులు  ప్రారంభమయ్యాయి. 948 hPa (27.99 inHg) కనిష్ట బారో మెట్రిక్ పీడనం నమోదైంది. మరుసటి రోజు 18 నవంబర్​  సాయంత్రానికి   205 కి.మీ/గం (127 mph) వేగంతో గాలులు వీచాయి,  ఆంధ్రప్రదేశ్ తీరంలో దాదాపు 140 కి.మీ (87 మైళ్ళు) దూరంలో ఉంది.  IMD అంచనా ప్రకారం మూడు నిమిషాల పాటు 230 km/h (140 mph) వేగంతో గాలులు వీచాయి – ఇది ఈ వ్యవస్థను ఆధునిక సూపర్ సైక్లోనిక్ తుపానుగా మారింది.

 కనిష్ట బారోమెట్రిక్ పీడనం 943 hPa (27.85 inHg) తుఫాను తీరాన్ని సమీపిస్తున్నప్పుడు, 17 km/h (11 mph) వేగంతో వేగం పుంజుకుంది.  నవంబర్ 19న 11:00 గంటలకు  ప్రకాశం జిల్లా  చీరాల సమీపంలో   తీరాన్ని తాకింది.  ఒక నిమిషం పాటు 195 km/h (121 mph) వేగంతో గాలులు వీచాయి.   వ్యవసాయ భూములపై ​​ఉత్తరం దిశగా  కదులుతూ, తుఫాను బలహీనపడింది, ఆ సాయంత్రం 20 :00 గంటలకు  JTWC తుది హెచ్చరిక జారీ చేసింది.  

Super Cyclone@48 :  అటు సాగర హోరు.. ఇటు  చావు కేక

Super Cyclone@48 :

 1977 నవంబరు 19 శనివారం కాళరాత్రిగా మారి నిత్యం జల హోరు  వినిపించే రుద్ర ప్రళయ ఘోషతో సాగరం  విరుచుకుపడి, సాధారణ దివిసీమను  శవాల దిబ్బగా (dead bodies)  మార్చింది.  గ్రామాలకు గ్రామాలను సముద్ర గర్భంలోకి కలిపేసింది.  సముద్రం హోరులో సుమారు 30 అడుగులు ఎత్తున ఎగసిపడిన రాకాసి అలలు గ్రామాలపై పడి తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన  కొన్ని  నిముషాలలోనే గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుపోగా, 10 వేల మంది (10,000 )  పైగా జనం నిర్జీవులయ్యారు.  వేలాది పశు సంతతి మృత్యువాత పడింది. కోట్లాది రూపాయలు విలువ గల ఆస్తినష్టం జరిగింది. నాగాయలంక, కోడూరు మండలాల తీర ప్రాంత గ్రామాలలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే.  ఆప్తుల రోదనలు, ఆర్తనాదాల శోకం సాగర హోరులో   కలిసిపోయింది.

Super Cyclone@48 :  శవాల దిబ్బగా.. దివిసీమ

నాగాయలంక మండలంలోని ఎదురు మొండి (Edurumondi), ఈల చెట్ల దిబ్బ, నాచు గుంట, దీన దయాళప్పురం, కమ్మన మోలు, సొర్ల గొంది (Sorla gondi) , సంగమేశ్వరం, ఏటి మొగ, గుల్లల మోద, భావ దేవరపల్లి, కోడూరు మండలంలోని గొల్లపాలెం, ఊట గుండం (Uta Gundam), బసవన్నవాని పాలెం, హంసలదీవి, (Hansla divi)పాలకాయితిప్ప, ఉల్లిపాలెం (Ulli palem), ఇరాలి తదితర గ్రామాలలో 10 వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది ఎకరాలలో వరి పంట సముద్రంపాలు అయింది. ఆనాటి పెను ఉప్పెనకు కోడూరులోని పాలకాయి తిప్ప, హంసల దీవి, గుల్లలమోద, బసవన్నవాని పాలెం, ఊట గుండం, సొర్ల గొంది, గుల్లల మోద, ఏటి మొగ, ఎదురుమొండి తదితర గ్రామాల్లో దివిసీమ ప్రాంతం కాళరాత్రిగా మారింది. ఈ తుపానులో సుమారు 10 వేల మందికిపైగా ప్రాణాలు విడిచారు.

దివిసీమ గాంధీ .. మండలి

Super Cyclone@48 :

దివిసీమ గాంధీ, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు (Mandali Venkata Krishna Rao)  దివిసీమ ప్రాంత ప్రజలు కూడు, నీడ లేక రోడ్డున పడ్డ జనాభాకు ఆపద్బాంధవుడయ్యారు. దేశ, విదేశాల నుంచి ఎన్నో స్వచ్ఛంద సేవాసంస్థలకు పిలుపునిచ్చి ప్రజలకు సేవలందించారు. ఆయన చేసిన సేవలు నేటికీ దివిసీమ ప్రాంత ప్రజలు ప్రతీ ఏడాది నవంబరు 19 రాగానే గుర్తుంచుకుని కన్నీంటిపర్యంతమవుతారు. అప్పటి రాష్ర్టపతి జైల్​ సింగ్​, ( Prisident Jail Singh)   ప్రధాని ఇందిరా గాంధీని (Indira Gandhi)  దివిసీమకు రప్పించారు. ఇక్కడి హృదయ విదారక దృశ్యాలతో ఇందిరాగాంధీ చలించిపోయారు.

Super Cyclone@48 :  తారలు దిగొచ్చి..

Super Cyclone@48 :

 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న ఎన్టీఆర్​, (NTR)నట సామ్రాట్​ అక్కినేని నాగేశ్వరరావు (ANR) .. సినీ జగత్తును కదిలించారు. మహానటులు ఎన్టీఆర్​, ఏఎన్​ఆర్​.. కైకాల సత్యనారాయణ.ఎందరో  హీరోయిన్లు జోలి పట్టారు.  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​లో  విరాళాలు సేకరించారు. కూడు, గుడ్డ, నీడ కల్చించారు. రోదరలో వైద్యులు (Doctors)  దివిసీమకు ( Cyclone Effected Diviseema) తరలి వచ్చారు. గ్రామాల్లో వైద్య సేవలు అందించారు. ఇక అప్పటి యువజనం (Youth)  మరుభూమిగా మారిన  దివిసీమలో.. ప్రాణాలను లెక్కచేయకుండా.. సామూహిక శవ సంస్కారాల్లో పాల్గొన్నారు. కుళ్లిన శవాలను వెలికి తీశారు. ఇక కొన ఊపిరిలోని దివిసీమ జనానికి  ప్రాణవాయువు అందించారు.

Super Cyclone@48 :  మేము ఉన్నాం..అంటూ

Super Cyclone@48 :

దివిసీమపై  ఉప్పెన  ఉపద్రవం ఘటనతో  ప్రపంచ దేశాలు చలించిపోయాయి. తక్షణం స్పందించాయి.  కడలి చెంతకు  కదిలి వచ్చాయి. వందలాది స్వచ్చంద సంస్థలు దివిసీమ పునర్నిర్మాణానికి  మేమున్నామంటూ ఊరూరుకి వచ్చారు. నాటి నుంచి నేటి వరకు దివిసీమ జ నజీవన స్రవంతిలో పెనుమార్పులు సంభవించాయి. రాజకీయంగా, ఆర్థికంగా దివిసీమ పరిపుష్టిని సాధించుకుంది. నాటి ఉప్పెనలో 10 వేల మంది ప్రజల ప్రాణాల విలువను, జరిగిన నష్టాన్ని ఏడాదికొకసారి స్మరించుకోవటం మానవీయ ధర్మం. అప్పటి ఉప్పెన మృతుల జ్ఞాపకాల చిహ్నంగా దివిసీమ ముఖ ద్వారం వద్ద నిర్మించిన పైలాన్   ఎప్పటికీ ప్రజలను హెచ్చరిస్తూనే ఉంది.

Super Cyclone@48 :  జర్నలిస్టుల తపనే వేరు

Super Cyclone@48 :

దాదాపు 10,000 మందిని మింగేసిన దివిసీమ ఉప్పెన ఉపద్రవం స్థితి, గతిని సభ్య సమాజానికి తెలియజేయటానికి అప్పటి జర్నలిస్టులు పడిన తపన అంతా ఇంత కాదు. సమాచార వ్యవస్థ దెబ్బతింది. కేవలం రేడియో (Only Radio) సమాచారంతోనే దివిసీమలో ఏం జరిగిందో.. తెలిసేది. సెల్​ ఫోన్లు లేవు. ల్యాండ్​ లైన్ (Land Line Phone) ​ ఫోన్లే అందుబాటులో ఉన్నాయి. ఫోన్ల స్థంభాలు ధ్వంసమయ్యాయి. ఈ స్థితిలో పత్రికలు పడిన కష్టం వర్ణనాతీతం.  పత్రిక  ప్రచురణ సంస్థలన్నీ విజయవాడ (Vijayawada) కేంద్రంగా పని చేస్తున్నాయి. అప్పట్లో జిల్లా కేంద్రంలోనే రిపోర్టర్లు  (Reporters) ఉన్నారు. సూపర్​ సైక్లోన్​ ప్రభావం మచిలీపట్నంపై కూడా పడింది. మచిలీపట్నం కూడా మునిగిపోయింది. ఈ స్థితిలో విజయవాడ నుంచి విలేకరులు, ఫోటో గ్రాఫర్లు (Photo graphers)  దివిసీమకు బయలు దేరారు. రోడ్లపై చెట్లు పడిపోయాయి. బస్సులు లేవు. కార్లు వెళ్లలేని స్థితి.

Super Cyclone@48 :  చలించిన ఆంధ్రప్రభ

ఇక ఆంధ్రప్రభ (Andhra Prabha) , ఆంధ్రపత్రిక  (Andhra Patrika), ఆంధ్రభూమి (Andhra Bhoomi)  దిన పత్రికలు తమ వార్తల సేకరణకు తీవ్రంగా శ్రమించాయి. ఫోటో గ్రాఫర్లు ఉదయమే ఆరు గంటలకు సైకిల్​ పై తుపాను ప్రాంతాలకు బయలు దేరి వెళ్లారు. మళ్లీ.. సాయంత్రం 4.00 గంటలకు విజయవాడకు చేరుకుని, రీళ్లను కడిగి, ఫోటోలు ఫ్రింటులు వేసి .. ఎడిటర్లకు అందజేశారు. ఆంధ్రప్రభ ఎడిటర్​  (Andhra Prabha Editor) పొత్తూరు వెంకటేశ్వరరావు (Potturi Venkateswara Rao).. ఫోటోగ్రాఫర్​ , అలాగే వార్త స్ర్కిప్ట్​ కోసం ఎదురుతెన్నులు చూశారు. ఇక ఎప్పటికప్పుడు ఆంధ్రప్రభ వార్తలు,  ఎడిటోరియల్స్​  కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారంటే.. కేవలం అతిశయోక్తి కాదు.

Leave a Reply