Container | కంటైనర్‌ను ఢీకొన్న డీసీఎం.. ఒకరి మృతి

Container | కంటైనర్‌ను ఢీకొన్న డీసీఎం.. ఒకరి మృతి

Container | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు డీసీఎం వాహనం ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply